Pages

Tuesday 19 March 2013

పద్మశాలీలు:




పద్మశాలీలు:

పద్మశాలీలు అనేది బ్రాహ్మణ కులాలకు చెందిన ఒక ఉపకులము. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాస్ట్రాల్లో కనిపించే వీరిలో మతాలను అనుసరించి శైవులు మరియు వైష్ణవులు అనే రెండు గ్రూపులు, వృత్తులను అనుసరించి కైకాల, కర్ణభక్తులు, పట్టుసాలి, సేనాపతులు, తొగటసాలీలు అనే గ్రూపులున్నాయి. భారతీయ కులవ్యవస్థ ప్రకారము వీరు O.B.C కులాలకు చెందుతారు.


నిర్వచనము:

పద్మము అనగా తామర పద్మము లేదా కమలము, శాలి అనగా సిల్కు వస్త్రము, తులు భాషలో సాలీ అనగా సాలెపురుగు. వైష్ణవుల ప్రకారము పద్మము అనగా ఉన్నతమైన మానవుడి మేధస్సును ప్రతిబంబించె సహస్రధార పద్మము అని అర్ధము. పద్మశాలి అను పదమునకు భౌతికంగా విజ్ఞానము అని అర్ధము. ఒక పురాణగాధ ప్రకారం తిరుపతిలో మంగాపురానికి చెందిన పద్మావతి (తిరుపతి వెంకటెశ్వరుని భార్య) తాను పద్మశాలి కుమార్తెనని చెప్పుకున్నదని, దానిప్రకారంగా పద్మశాలి అను కులం ఏర్పడిందని చెప్పవచ్చు.

శైవుల ప్రకారము మానవాళి యొక్క నగ్నత్వాన్నికి వస్త్రాలు ధరింపజేయాలనే ఉద్దేశ్యంతో శివుడు మార్కండేయుని యాగాన్ని నిర్వహించమన్నాడు. ఆ యాగంలోనుండి భావన అను ౠషి చేతిలో పద్మాన్ని పట్టుకొని ఉద్భవించాడు. అతడు సూర్య భగవానుడి కుమార్తెలైన ప్రసన్నవతి మరియు భద్రావతి లను వివాహం చేసుకొని నూరునొక్కటి కుమారులకు తండ్రి అయ్యాడు. ఈ కుమారులు పద్మము యొక్క నారతో వస్త్రాలను తయారుచేసే వృత్తిని ఎన్నుకొని పద్మశాలీల నూరునొక్కటి గోత్రాలకు గోత్ర పురుషులైయ్యారు.


గ్రంధ మూలాలు:

హిందూ గ్రంధాల ప్రకారం పద్మ శాక అనువాడు బ్రహ్మ తమ కులానికి ఇచ్చిన అద్భుతమైన రత్నం యొక్క మహిమను గణపతి(వినాయకుడు)కి వివరించుటకు విముఖత చూపాడు. ఫలితంగా గణపతి శాపంతో పద్మసాలీలు బ్రహ్మణ స్థాయిని కోల్పోయారు. శాపవిమోచనం కోసం అదే పద్మశాలీ కులానికి చెందిన పరబ్రహ్మమూర్తి (పద్మభావచార్య) అను కారణజన్ముడు గణపతికి మొరపెట్టుకొన్నాడు. పరబ్రహ్మ మూర్తి తపస్సును మెచ్చిన గణపతి కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత పద్మశాలీలు శాపవిమోచనం పొందుతారని చెబుతాడు. ఈ పరబ్రహ్మ మూర్తి తన కులస్తులను 101 గోత్రాలతో 8 శాఖలుగా విడదీసి 4 మఠాలు స్థాపించి వాటికి గురువులను నియమించాడు.

అచార వ్యవహారాలు:

సనాతన బ్రాహ్మణ కులాలకు మరియూ వీరికీ ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసం ఉన్నది. పద్మశాలీలలో ఒక్క పట్టుశాలీ శాఖ మినహా మిగిలిన శాఖలవారు మాంసాహారము కూడా భుజిస్తారు. మరి ముఖ్యంగా వీరి ఆచార వ్యవహారాల్లో ఆర్య మరియు ద్రావిడ సంస్కృతులు కనిపిస్తాయి. అందువలన పద్మశాలీలు సమాజంలో సనాతన బ్రాహ్మణులుగా పరిగణింపబడలేదు. అయితే వీరు ఉపనయన సంస్కార సమయంలో జంద్యము మాత్రం ధరిస్తారు.


No comments:

Post a Comment